టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు కలెక్షన్లను సాధిస్తాయనే సంగతి తెలిసిందే. ఖుషీ తర్వాత పది సంవత్సరాల పాటు ఆ స్థాయి హిట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశకు గురి కాగా రీఎంట్రీలో వకీల్ సాబ్ సినిమాతో పవన్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమాకు టీవీలో 19.12 రేటింగ్ వచ్చింది.
ఈ రేటింగ్ మంచి రేటింగ్ అయినప్పటికీ పవన్ రేంజ్ కు మరింత ఎక్కువ రేటింగ్ వచ్చి ఉండాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకు 20 లోపే రేటింగ్ రావడానికి ఇతర కారణాలు చాలా ఉన్నాయి. వకీల్ సాబ్ ప్రసారమైన జీ తెలుగు ఛానల్ కు రూరల్ ప్రాంతాల్లో రీచ్ కొంత తక్కువగా ఉంది. వకీల్ సాబ్ ప్రసారమైన సమయంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వకీల్ సాబ్ ప్రసారం కాకుండా చేశారనే ఆరోపణలు వినిపించాయి.
ఇతర ఛానెల్స్ లో ఈ సినిమా టెలీకాస్ట్ అయ్యి ఉంటే మాత్రం రేటింగ్ 20 కంటే ఎక్కువగా ఉండేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వకీల్ సాబ్ రేటింగ్ తక్కువగా రావడానికి పవన్ కళ్యాణ్ అని కామెంట్లు చేస్తున్న వాళ్లు ఈ లాజిక్ ను మాత్రం మిస్ అవుతున్నారు. అయితే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ లను నమోదు చేసిన సినిమాల జాబితాలో మాత్రం వకీల్ సాబ్ సినిమా చోటు దక్కించుకోలేదు. రిలీజైన కొన్ని వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన వకీల్ సాబ్ మంచి రేటింగ్ నే సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!