Sini Shetty: సీనీ శెట్టి ఇష్టాయిష్టాలు.. ఫొటోలు అదిరిపోయాయిగా!

సినీ శెట్టి.. నిన్న మొన్నటివరకు ఈ పేరు చాలా తక్కువమందికే తెలుసు. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఈ పేరు మారుమోగిపోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మిస్‌ ఇండియా కాబట్టి. ఫ్యాషన్‌ ప్రపంచంలోకి మిస్‌ ఇండియాగా అడుగుపెట్టిన సినీ శెట్టి తర్వాత సినిమా రంగంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ, ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇష్టాయిష్టాలేంటో మీరూ చదివేయండి!

* సినీ శెట్టి ముంబయిలో నివాసముంటోన్న ఓ కన్నడ కుటుంబంలో 2001లో జన్మించంది. 21 ఏళ్ల సినీ శెట్టి సీఎఫ్‌ఏ కోర్సు చేస్తోంది. అకౌంటెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

* డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉండటంతో నాలుగేళ్ల వయసులోనే భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. 14 ఏళ్ల వయసులో నృత్యకారిణిగా అరంగేట్రం చేసింది.

* సినీకి చిన్నతనం నుండి ఫ్యాషన్‌పై మక్కువెక్కువ. మోడల్‌గా ఎదగాలని కలలు కంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోకి అడుగుపెట్టి విజేతగా గెలుపొందారు.

* సినీ శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో 2017లో అడుగుపెట్టింది. ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోని తొలిసారి షేర్‌ చేసింది. ప్రకృతి అంటే తనకెంతో ఇష్టమని ఆమె పలు పోస్టులలో తెలిపింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య సుమారు లక్ష. ఇప్పటివరకూ ఆమె చేసిన పోస్టుల్లో ఎక్కువ శాతం డ్యాన్స్‌ వీడియోలే.

* ఈ మిస్‌ ఇండియా ఒకప్పటి ఎయిర్‌టెల్‌ భామ అని తెలుసా?. ఎయిర్‌టెల్‌ కోసం గతంలో రూపొందించిన ఓ యాడ్‌ కోసం ఆమె నటించింది. కెమెరా ముందు తన జర్నీ సరదాగా సాగిందని సినీ శెట్టి చెప్పింది.

* తన తల్లే తనకి స్ఫూర్తి అని సినీ శెట్టి వివిధ సందర్భాల్లో చెపుకొచ్చింది . ఆమె నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన సినీ శెట్టి తన తల్లి అందంలో కొంత కూడా తనకి రాలేదని సరదాగా అంటూ ఉంటుంది.

* ‘‘జీవితంలో ఏదీ అంత సులభంగా రాదు. ప్రతిదాని వెనుక కనిపించని కష్టం ఉంటుంది’’ అనే మాటను ఆమె ఎక్కువగా నమ్ముతుంది. సాధించాలనుకున్న దాని కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటానని ఆమె కొన్ని సందర్బాల్లో చెప్పింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus