Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

‘అఖండ’ సినిమా వచ్చినప్పుడు దానికి సీక్వెల్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే క్లైమాక్స్‌లో రెగ్యులర్‌ సినిమాలాగే సీక్వెల్‌ అవకాశమిస్తూ ముగించారు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్‌ సినిమాను సిద్ధం చేశారు. ఆ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ ప్రీమియర్లు ఉన్నాయి. తెలంగాణ సంగతి ఈ వార్త రాసే సమయానికి ఇంకా తేలలేదు. మధ్యలో సినిమా రిలీజ్‌ గురించి ఏవేవో చర్చలు, పుకార్లు నడుస్తున్నాయి. ఈలోగా మరో వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ సినిమాకు సీక్వెల్‌.

Akhanda Sequel

‘అఖండ’ ప్రపంచం ఇప్పుడు రెండు పార్టులతో ఆగదని, కొనసాగుతూనే ఉంటుందని చిత్రబృందం ఇప్పటికే చెప్పేసింది. అయితే మూడో పార్టు గురించి ఇప్పుడే చెప్పరు. రెండో పార్టు తరహాలోనే కొన్నాళ్ల తర్వాత అనౌన్స్‌ చేస్తారేమో అనుకున్నారంతా. కానీ మూడో పార్ట్‌ని ఇన్‌డైరెక్ట్‌గా అనౌన్స్‌ చేసేశారు. సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్‌ కలిపి ఓ ఫొటో దిగి.. సినిమా రీరికార్డింగ్‌ పనులు అయిపోయాయని చెప్పాలనే ప్రయత్నం చేశారు.

దాంతోపాటు సినిమా మూడో భాగం ఆలోచన వచ్చేసిందని.. దాని పేరు ఇదే అంటూ ఓ టైటిల్‌ను లీక్‌ చేశారు. మిక్సింగ్‌ సందర్భంగా తెరపై సినిమా వేసి ఆఖరున ‘జై అఖండ’ అనే పేరు వచ్చిన దగ్గర పాజ్‌ కొట్టి ఉన్నారు. దాంతో మూడో ‘అఖండ’ సినిమా పేరు ‘జై అఖండ’ అని తేలిపోయింది. అయితే ఇది రెండో ‘అఖండ’ ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే ఏ సినిమాకైనా ఇదే పరిస్థితి.

‘జై అఖండ’ చూస్తే ‘జై హనుమాన్‌’ వైబ్స్‌ వస్తున్నాయి. అలాగే ఈ లీక్‌ చూస్తుంటే ‘పుష్ప 3’ వైబ్స్‌ వస్తున్నాయి. మరి బోయపాటి మైండ్‌లో ఏముంది, ఎలాంటి కథ సిద్ధం చేశారు. ఇందులో బాలయ్యను ఎలా చూపిస్తారు అంటూ ఇప్పటికే చర్చలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి.

 ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus