Bheemla Nayak Movie: ‘భీమ్లా నాయక్‌’ వెనకడుగు వేస్తున్నడట!

శుభం పలకరా పెళ్లి కొడకా అంటే… XXX XXX XXX ఎక్కడ చచ్చింది అన్నాడట ఎనకటికొకడు. ఈ సామెత వినే ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ విషయంలో ఇలాంటి సామెతను ఆపాదించాల్సి వస్తోంది. ఎందుకంటే అంతా సిద్ధం అనుకొని, ఏకంగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది, దానికి తగ్గట్టుగా సినిమాను వాయు వేగంతో చిత్రీకరణ పూర్తి చేస్తుంటే… ‘ఆ రోజు సినిమా రావడం కష్టమే’ అంటూ పుకార్లు రేపుతున్నారు. మొన్నామధ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఇలాంటి పుకార్లే వచ్చాయి. ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’కి వస్తున్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేస్తామంటూ కొన్ని రోజుల క్రితమే ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌ అనౌన్స్‌ చేసింది. దీంతో సంక్రాంతికి స్టార్ల సందడి అంటూ అందరూ ముచ్చటపడిపోయారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. పవన్‌ లుక్‌, టైటిల్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. రానా లుక్‌కు సంబంధించిన వీడియో త్వరలో వస్తుందట. అయితే ఈలోగా సినిమా విడుదల అనుకున్న డేట్‌కి డౌటే అంటూ పుకార్లు వస్తున్నాయి.

సినిమాను తొలుత అనుకున్నట్లు సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని… అప్పటికి సినిమా పూర్తవ్వదని టాలీవుడ్‌లో ఓ వర్గం లీక్‌లు ఇస్తోంది. జనవరి 12 అంటే సుమారు ఐదు నెలలు ఉంది. ఈలోగా సినిమా పూర్తవ్వదు అని ఎలా అనుకుంటున్నారో తెలియదు. అయితే వాళ్ల డౌట్‌ను ఎందుకు కాదనడం…. సెప్టెంబరు 2న తొలి పాట వినిపిస్తాం అంటున్నారు కదా… ఆ రోజు మళ్లీ క్లారిటీ ఇస్తారేమో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus