Sri Simha Koduri: శ్రీసింహ ఇంటర్వ్యూలో హోస్ట్‌ రీతూ సీరియస్‌ ప్రశ్నలు… ఎందుకోసం ఇలా?

హీరో కొడుకు హీరో అవుతాడు.. గత కొన్నేళ్లుగా మన సినిమా పరిశ్రమలో ఇదే జరుగుతూ వస్తోంది. అలా కాకుండా వేరే వారసత్వంతో వచ్చిన హీరోలు విజయాలు అందుకోవడం తక్కువగా ఉంటుంది. నిర్మాతల తనయులు, దర్శకుల వారసులు, హీరోయిన్ల వారసులు వచ్చి రాణించలేకపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లోకి వచ్చిన ఓ వారసుడు సింహా కోడూరి (Sri Simha Koduri) . సినిమాలు బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు అని తెలిసిపోతుంది.

అయితే, ఇంటి పేరు కోడూరి ఉంది కదా అంటారా? పేర్లు విషయంలో కీరవాణి (M. M. Keeravani) , రాజమౌళి (S. S. Rajamouli) ఫ్యామిలీలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ లెక్కన ఏది కరెక్ట్‌, ఎందుకు పెట్టుకున్నారు అనే డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీనికి ఆన్సర్‌ ఆయన నోటి నుండే వినొచ్చు. దాంతోపాటు మరికొన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకబోతున్నాయి. పీపుల్‌ మీడియా ప్రొడక్షన్‌ హౌస్‌ పీఎంఎఫ్‌ ఎంటర్‌టైన్మెంట్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ రన్‌ చేస్తోంది.

అందులో టీవీ నటి రీతూ చౌదరి హోస్ట్‌గా ‘దావత్‌’ అనే షో రన్‌ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఈ వారం హోస్ట్‌గా సింహా కోడూరి వచ్చాడు. ఈ క్రమంలో కాస్త బోల్డ్‌గా, ఇంకాస్త సరదాగా ఇంటర్వ్యూ సాగింది. దానికి సంబంధించిన ప్రోమోను టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలో సింహ – కీరవాణి మధ్య ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వచ్చాయి. నిజానికి హోస్ట్‌ అడిగేంతలా ఎక్కడా ఎవరూ వాళ్ల గురించి మాట్లాడుకోవడం లేదు. కానీ ఆమెతో అయితే అడిగించారు.

మీ నాన్నతో దిగిన ఒక్క ఫొటో కూడా నీ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు ఎందుకు? మీరు మీ నాన్న మాట్లాడుకోరా? ఇలా చాలా ప్రశ్నలే వేసింది రీతూ చౌదరి. మరి వాటికి సింహా ఏం చెప్పాడు అనేది ఎపిసోడ్‌లోనే తెలియాలి. అన్నట్లు మీ నాన్న ఎం.ఎం. అని ఇంటి పేరుగా పెట్టుకుంటే నువ్వు కోడూరి అని ఎందుకు పెట్టుకున్నావ్‌ అని కూడా అడిగారు. వీటికి క్లారిటీ వచ్చి పుకార్లు ఆగుతాయని ఈ ప్రశ్నలు అడిగారా? లేక లేనిపోని డౌట్స్‌ క్రియేట్‌ చేసి.. క్లియర్‌ చేద్దాం అనుకున్నారా అనేది తెలియడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus