మహేష్ నెక్స్ట్ ప్రాజక్ట్ గురించి ఆసక్తికర విషయం
- February 22, 2017 / 07:27 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే ప్రిన్స్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ తో మూవీ అయిపోయిన వెంటనే కొరటాల శివ ప్రాజక్ట్ ను మహేష్ పట్టాలెక్కించనున్నారు. అందుకే కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కగా పూర్తి చేశారు. “భరత్ అను నేను” అనే పేరుని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన డైరక్టర్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22 తేదీన విడుదల చేయాలనీ మొదట అనుకున్నారు. జనవరి నుంచి సినిమా మొదలయి ఉంటే అప్పుడే రిలీజ్ అయ్యేది.
కానీ మహేష్ 23 మూవీ షూటింగ్ కొనసాగుతోంది. బహుశా మార్చి డేట్స్ కూడా మురుగుదాస్ మూవీకి మహేష్ కేటాయించనున్నారు. కొరటాలతో సినిమా ప్రారంభం ఆలస్యం కానుండడంతో రిలీజ్ డేట్ మారింది. 2018 సంక్రాంతికి “భరత్ అను నేను” విడుదల చేయాలనీ చిత్ర బృందం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న రెండో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















