Nagarjuna: నాగ్ కన్ఫర్మ్ చేయలేదు.. కానీ జరిగేలానే ఉంది..!

అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామి రంగ’ తో ఓ డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. విజయ్ బిన్నీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా కేవలం సంక్రాంతి పండుగను టార్గెట్ చేసే 3 నెలల్లో కంప్లీట్ అయ్యింది. నాగార్జునకి మాత్రమే కాదు ప్లాపుల్లో ఉన్న నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, అల్లరి నరేష్, రాజ్ తరుణ్..లని కూడా ఈ మూవీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అని చెప్పాలి. 6 నెలల్లో ఓ పాతిక కోట్ల సినిమా తీసి రూ.50 కోట్లు ఎలా సంపాదించవచ్చో ఈ మూవీ చాటి చెప్పినట్టు అయ్యింది.

సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. నాగార్జున నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో ధనుష్ – శేఖర్ కమ్ముల.. ప్రాజెక్టులో కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు నాగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రాజమౌళి సినిమాలో నాగార్జున నటిస్తున్నాడు అనేది ఆ వార్త. రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఉగాదికి ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుంది.

కె.ఎల్.నారాయణ నిర్మాత. అయితే ఈ సినిమాకు రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. దీని కోసం మహేష్ కూడా ఓ నిర్మాతగా మారాడు. అలాగే నాగార్జున కూడా సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయట.నాగార్జున ఈ ప్రాజెక్టులో ఎంటర్ అవ్వడానికి ఇంకో కారణం.. ఈ మూవీలో ఆయన ఓ ప్రత్యేక పాత్ర కూడా చేయబోతుండడం వల్ల అని ఇన్సైడ్ టాక్. ఈ విషయం పై ఇది వరకే నాగార్జున ఓ ట్వీట్ కూడా వేశాడు.

మహేష్ ను ట్యాగ్ చేస్తూ నాగ్ గతంలో ‘మీ నాన్న మా నాన్న కలిసి నటించారు, మీ నాన్నగారితో నేను కూడా కలిసి నటించాను.ఆ పరంపరని కొనసాగించాలి కదా?’ అంటూ నాగ్ ట్వీట్ చేయడం జరిగింది. అందుకు మహేష్ త్వరలోనే కలిసి సినిమా చేద్దాం అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ‘నా సామి రంగ’ ప్రమోషన్స్ టైంలో నాగార్జునకి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. అప్పుడు (Nagarjuna) నాగ్.. ‘రాజమౌళి గారి సినిమా’ అంటూ మొదలుపెట్టి ఆపేశాడు. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus