మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టినటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా వెండితెరపై నటించే సందడి చేశారు. అయితే ఈమెను హీరోయిన్ గా మెగా ఫాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు దీంతో ఈమె హీరోయిన్గా ఏమాత్రం సక్సెస్ సాధించలేదని చెప్పాలి. ఇలా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన నిహారికకు సక్సెస్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.
జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో నిహారిక వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వివాహమైన రెండు సంవత్సరాలకి నిహారిక విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.అయితే నిహారిక విడాకుల విషయం ప్రకటించినప్పటికీ ఈమె విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఈ సందర్భంగా నిహారిక (Niharika) విడాకుల గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య జాతకాల ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని ముందుగా తెలిసినప్పటికీ కుటుంబ సభ్యులు వీరి వివాహం జరిపించారట. వీరిద్దరి జాతకాలు పరిశీలించిన అనంతరం జాతక దోషాలు ఉన్నాయని, ఈ దోషాలు తొలగిపోవాలంటే ప్రత్యేక పూజలు చేయాలని తెలియజేశారట.
ఇలా వివాహం జరిగిన వెంటనే ఈ దంపతుల చేత జాతక దోష పరిహార పూజలు కనుక చేయించి ఉంటే వివాహ బంధం బలపడేదని అలాకాకుండా వీరి జాతక దోష పరిహార పూజలను వాయిదా వేస్తూ చేయించకపోవడం వల్లే దోష ప్రభావం కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ వీరి విడాకుల గురించి ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!