యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానుండగా కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటం గమనార్హం. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ ఛరిష్మా తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా అవసరం కాగా
ఎన్టీఆర్ కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నా ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీకి మాత్రమే ప్రచారం చేయాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్లే ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే రిస్క్ తీసుకోకుండా కచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. సెలబ్రిటీల రాజకీయ వైఫల్యాల నుంచి ఎన్టీఆర్ పాఠం నేర్చుకోవడంతో పాటు రాజకీయాల్లోకి వెళితే ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి.
అయితే చంద్రబాబు ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తారా..? అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. 2009లో ఎన్టీఆర్ టీడీపీ కోసం బాగానే కష్టపడినా కొన్ని కారణాల వల్ల టీడీపీ అధికారంలోకి రాలేదు. 2024లో టీడీపీకి ఎన్టీఆర్ మద్దతు ఇస్తారో లేదో ఎన్టీఆర్ ఫ్యాక్టర్ టీడీపీకి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!