Ranamandala: ‘రణమండల’ గురించి మీకు తెలుసా? సినిమా వెనుక చాలా కథ ఉంది!

  • October 29, 2024 / 05:12 PM IST

ఇండస్ట్రీకి కొందరు సినిమాలు చేయడానికి వస్తారు, ఇంకొందరు చరిత్ర రాయడానికి వస్తారు. అయితే ఈ రెండు రకాల వ్యక్తుల రాక ఒకేలా ఉంటుంది. వారి ప్రయాణం మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో రెండో రకానికి చెందిన వాళ్లం అవ్వాలని ప్రయత్నిస్తున్న టీమ్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. వివిధ వ్యాపారాలతో బిజీగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీజీ విశ్వప్రసాద్‌ (T. G. Vishwa Prasad) సినిమాల మీద ప్యాషన్‌తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వంద సినిమాలు పూర్తి చేయాలనేది ఆయన లక్ష్యం.

Ranamandala

అలాంటి ఆయన ఇటీవల ఓ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అనౌన్స్‌ చేశారు. దాని పేరే ‘రణమండల’ (Ranamandala). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుండి మరో ప్యాన్ ఇండియాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను అధికారికంగా చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. అయితే హీరో ఎవరు, దర్శకుడు ఎవరు? లాంటి వివరాలు ఏవీ చెప్పలేదు. కానీ ఒక చిన్న పాపకు అభయమిస్తున్న హనుమంతుడి పాదాన్ని యానిమేషన్ రూపంలో రివీల్ చేశారు. దీంతో ఈ సినిమా ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోంది అని చెప్పేయొచ్చు.

అయితే ఇండస్ట్రీ నడుస్తున్న టాక్‌ ప్రకారం అయితే.. ఈ సినిమా (Ranamandala) వెనుక చాలా పెద్ద కథ ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఆదోని అనే పట్టణం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. ఆంధ్రప్రదేశ్‌ – కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఉండే సిటీ పొలిమేరలో కొండ మీద రణమండల అనే దేవాలయం ఉంది. అందులో ఆంజనేయస్వామి కొలువై ఉంటాడు. ఆ దేవాలయం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది అని చెప్పొచ్చు.

దేవాలయంలోని ఎర్ర చందనం పూసిన స్వామి రాతి విగ్రహాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తారట. ఆ స్వామి వారి కథనే సినిమాగా చేస్తున్నారట. అదే ఎందుకు అంటే.. పీపుల్స్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ది ఆదోనే. ఆయన బాల్యం, చదువు అక్కడే జరిగాయి. అందుకే రణమండల మీద అవగాహన, అభిమానం ఉన్నాయి ఆయనకు. మరి ఇందులో ఎవరు నటిస్తారు అనేది చూడాలి.

ఆ హీరోయిన్ తో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన హీరో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus