భాగమతి పోస్టర్ లో ఆకర్షిస్తున్న అంశాలు!

బాహుబలి చిత్రం తర్వాత అనుష్క చేస్తున్నసినిమా భాగమతి. పేరులోనే లేడీ ఓరియెంటెడ్ మూవీగా అర్ధమవుతోంది. అందుకోసమే ఈ చిత్రాన్ని ఒప్పుకోకుండా ఇందుకోసం ఏడాదిగా స్వీటీ కష్టపడుతోంది. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అనుష్క పుట్టిన సందర్భంగా రిలీజ్ చేశారు. చేతిలో సుత్తి పట్టుకొని ఒంటిపై గాయాలతో, రగిలిపోతూ శత్రు సంహారాణికి సిద్ధమైనట్లున్న అనుష్క లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కొన్ని ఆకర్షిస్తున్న అంశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే…

పోస్టర్ లో పోస్టర్
ఒక పాత భవన గోడకి అనుకోని ఉన్న అనుష్క కి పక్కనే ఓ పోస్టర్ అతికించి ఉంది. ఈ పోస్టర్ కథకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది.

పోస్టర్ లో మహిళ కి బంధాలు
వాల్ పోస్టర్ లో ఉన్న మహిళ కాళ్లకు గొలుసులు మాత్రమే కాదు.. పెళ్లి అయిన తర్వాత ధరించే నగలు ఉన్నాయి. అవి కూడా నేటి మహిళలకు కష్టాలను తెచ్చి పెడుతున్నాయని స్పష్టం చేస్తోంది.

గాయం నొప్పి కంటే బాధ
అనుష్క ఎడమ అరచేతిలో మేకును సొంతంగా కొట్టుకున్నట్టు ఉంది. పైగా ఆ నొప్పికంటే తాను ఎంతో బాధలో ఉన్నట్టు ఆమె ఫీలింగ్ బయటపెడుతోంది.

ఇలా అనేక సందేహాలతో ఆసక్తి కలిగించి అందరి దృష్టిని డైరక్టర్ అశోక్ మంచి ప్లాన్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus