కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

సుమారు నాలుగేళ్ళ తరువాత 118 చిత్రంతో హిట్టందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. 2019 సంవత్సరంలో ‘ఎఫ్2’ తరువాత హిట్టయిన చిత్రం ఒక్క ‘118’ మాత్రమే. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన కళ్యాణ్ రామ్ కి 118 చిత్రం మంచి రిలీఫిచ్చింది. ‘118’ హిట్టిచ్చిన ఎనర్జీతో కొత్త చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. కొత్త దర్శకుడు వేణు మల్లిడి ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. సోషియో ఫాంటసి గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

ఈ చిత్రానికి ఓ ఆసక్తి కరమైన టైటిల్ ను ఖరారు చేసారంట. అదే ‘తుగ్లక్’..! ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట. గతంలో ‘హరేరామ్’ చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్ పోషించాడు కళ్యాణ్ రామ్. అయితే ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉండగా చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. మరి ఈ ప్లాప్ సెంటిమెంట్ తో కళ్యాణ్ రామ్ హిట్టందుకుంటాడో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్.టి.ఆర్ ఆర్ట్స్’ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్, క్యాథెరిన్ లు హీరోయిన్లుగా నటించబోతున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus