యంగ్ హీరో సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తన సొంత బ్యానర్ తో పాటు బయట బ్యానర్లలో సినిమాలు ఓకే చేస్తూ తీరిక లేకుండా పని చేస్తున్నాడు. కరోనా వలన బ్రేక్ వచ్చిందే కానీ.. లేదంటే శౌర్య నుండి ఈ పాటికి ఓ సినిమా రిలీజై ఉండేది. ఈ ఏడాది జనవరిలో ఆయన నటించిన ‘అశ్వథ్థామ’ సినిమా రిలీజయింది. ఆ తరువాత లాక్ డౌన్ వలన ఖాళీగా ఉన్న శౌర్య ఈ మధ్యకాలంలో మొత్తం మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా. రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. ‘వరుడు కావలెను’. ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఫిలిం చాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో విషయం బయటకి వచ్చింది. ప్రస్తుతం సితార బ్యానర్ లో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అయితే ‘వరుడు కావలెను’ టైటిల్ మాత్రం శౌర్య సినిమా కోసమే రిజిస్టర్ చేయించారని సమాచారం. టైటిల్ బట్టి చూస్తుంటే ఇది పెళ్లి చుట్టూ తిరిగే యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సినిమాలో హీరోతో సమానంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత శౌర్య.. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా అలానే.. అనీష్ కృష్ణతో సొంత బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నాడు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus