మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగులో చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి లూసిఫర్ రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుండగా మోహన్ రాజా మొదట యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తారని ప్రచారం జరిగింది.
అయితే లూసిఫర్ రీమేక్ కు పాన్ ఇండియా అప్పీల్ కోసమే సల్మాన్ ఖాన్ ను ఈ సినిమాలో నటింపజేయాలనే ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కేవలం నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కాకినాడలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
కథ మీద నమ్మకంతో చిరంజీవి ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన స్పష్టత రానుంది. ఆచార్య సినిమా దసరా పండుగకు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ తో ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలన్న చిరంజీవి కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.