సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్రల బంధం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నరేష్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవిత్ర కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంది అని అంటుంటారు. అయినా సరే ఈ జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ నరేష్ మూడో భార్య .. అతనికి విడాకులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో .. నరేష్ – పవిత్ర ల పెళ్లి జరగడం లేదు. అయినా సరే ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు.
నరేష్ (Naresh) వికె సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిరి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నరేష్,, పవిత్రతో చేసిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘విజయ కృష్ణ మూవీస్’ బ్యానర్‌పై నరేష్ నిర్మిస్తుండడం విశేషం.ఏప్రిల్ 13 న ఈ మూవీ టీజర్ విడుదల కానుందని ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
నిజ జీవితంలో జంటగా జీవిస్తున్న నరేష్ – పవిత్ర .. మళ్ళీ పెళ్లి అంటూ సినిమా చేస్తున్నారు అంటే అందులో ఏ స్థాయిలో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.. వీరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో పండుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.