Rajamouli, Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు భారీ షాక్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్నేళ్ల క్రితమే మహేష్ జక్కన్న కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. కేఎల్ నారాయణ నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ గా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ రాజమౌళి కాంబో మూవీ సినిమా తెరకెక్కనుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సినిమా జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయితే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ ఇంకా పూర్తి చేయలేదని చెబుతూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఐడియా మీద వర్క్ చేస్తున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు. త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కానుండగా స్క్రిప్ట్ పనులు సకాలంలో పూర్తి కాకపోతే మహేష్ రాజమౌళి సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు సకాలంలో జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ కథ గురించి క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు. రాజమౌళి ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ లో సైతం ఆసక్తి నెలకొని ఉండటం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus