మెగా హీరో…. అక్కినేని హీరో బావ బావమరుదులు కాబోతున్నారు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తున్న ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతుందట. ఈ చిత్రం కోసం కూడా భారీ తరగణాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.
టబు, సుశాంత్, నివేతా పేతురాజ్,జయరాం, రాహుల్ రామకృష్ణ… చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లిగా నివేదా పేతురాజ్ నటిస్తుందని సమాచారం.ఇక సుశాంత్ చెల్లిగా హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందట. అంటే సుశాంత్, బన్నీ ఈ చిత్రంలో బావ బావమరిదిలు అన్న మాట. ఈ చిత్రం కథ ప్రకారం.. బన్నీ, పూజా హెగ్డే వివాహం.. అలాగే సుశాంత్, నివేతా పేతురాజ్ వివాహం కుండమార్పిడి పద్దతిలో ఒకే వేదిక పై జరగబోతుందట. త్రివిక్రమ్ ఆసక్తికర కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలుస్తున్నాడట. 2020 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus