Prabhas: హాలీవుడ్‌ నుండి నలుగురు వస్తున్నారు!

‘ప్రాజెక్ట్‌ K’.. ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక అప్‌డేట్‌ వస్తూనే ఉంది. అయితే అది అఫీషియల్‌గా కాకుండా.. పుకార్ల రూపంలో బయటికొస్తోంది. దీంతో నమ్మాలో నమ్మొద్దు తెలియడం లేదు. కానీ ఒక్కో అప్‌డేట్‌ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా కోసం నలుగురు హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు పని చేయబోతున్నారు అని సమాచారం. త్వరలో వీరితో షూటింగ్‌ మొదలవుతుంది అని చెబుతున్నారు. కృష్ణంరాజు కన్నుమూయడంతో ప్రస్తుతం ప్రభాస్‌ ఫుల్‌ లోగా ఉన్నారట. త్వరలో పరిస్థితులు కోలుకున్నాక సినిమా షూటింగ్‌లు మొదలవుతాయట.

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఉంటుంది అని అన్నారు. ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా.. ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్లు ఉంటాయని మాత్రం ఫిక్స్‌ అయ్యింది. సినిమాలో సుదీర్ఘమైన అయిదు యాక్షన్‌ సెగ్మంట్లు ఉన్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి, నాలుగు వేర్వేరు యూనిట్లు / టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారట.

ఆయా సన్నివేశాలను రూపొందించడానికి నలుగురు హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించనున్నారట. మునుపెన్నడూ లేని విధంగా ‘ప్రాజెక్ట్ కె’ను తెరకెక్కించడంలో భాగంగానే ఈ ఏర్పాట్లు అని తెలుస్తోంది. 2023 ఆఖరు కల్లా ‘ప్రాజెక్ట్ కె’ పూర్తి చేసి, 2024 ప్రథమార్ధంలో విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్స్‌ వేస్తోందట. ఈ సినిమాకు వైజయంతీ మూవీస్‌ రూ.500 కోట్ల బడ్జెట్‌ పెట్టుకుందని అంటున్నారు. ప్రభాస్‌ రేంజ్‌ రిలీజ్‌ చేయడంతో ఆ సొమ్ము సులువుగానే వెనక్కి వచ్చేస్తుందని నమ్మకమట.

ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్ పాత్రను ఇతిహాసాల్లోని అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దారని చెబుతున్నారు. కుమారుడిగా ప్రభాస్‌ నటిస్తుండగా, బిగ్‌బీ సహాయకురాలిగా దీపికా పడుకొణె నటిస్తోందని తెలుస్తోంది. ఆ మధ్య నెల్లూరు జిల్లాలో సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు స్పేస్‌ షూట్లలో కొంతమంది నటుల మీద సన్నివేశాలు చిత్రీకరించారని వార్తలొచ్చాయి. దీంతో సినిమా నేపథ్యం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus