‘సర్కారు వారి పాట’ లేటెస్ట్‌ అప్‌డేట్‌

టాలీవుడ్‌ హీరోల్లో సినిమాలు షూటింగ్‌లు జరగనిది ఎవరైనా ఉన్నారా అంటే మహేష్‌బాబు అనే చెప్పాలి. ‘సర్కారు వారి పాట’ సినిమా అంగీకరించి… ముహూర్తం కూడా అయిపోయింది. అయితే ఇంకా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించలేదు. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ వార్తలు వస్తున్నా, ఎక్కడ అఫీషియల్‌ సమాచారం అయితే రావడం లేదు. అయితే ఇటీవల సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ అమెరికాలో చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అది కూడా కుదరదు అని తెలుస్తోంది. ‘సర్కారు వారి’ కొత్త అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణు తొలుత అమెరికాలో చేయాలని అనుకున్నా… ఇప్పుడు చిత్రబృంద ప్లాన్‌ మార్చేసిందట. అక్కడ కరోనా పరిస్థితులు అంత అనువుగా లేకపోవడంతో తొలి షెడ్యూల్‌ను దుబాయిలో చిత్రీకరిస్తారని తాజా సమాచారం. అక్కడ కరోనా పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సుమారు 25 రోజుల పాటు దుబాయిలో చిత్రీకరణ జరిపి తర్వాత అమెరికా వెళ్తారని తెలుస్తోంది. త్వరలోనే మహేష్‌ బృందం దుబాయి ఫ్లైట్‌ ఎక్కబోతోందట. జనవరి 25 నుంచి ‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్​ ప్రారంభం కానుందని సమాచారం.

దుబాయి షెడ్యూల్‌లో మహేష్‌​ బాబుతో సహా ఇతర నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. తొలి షెడ్యూల్​ పూర్తయ్యాక చిత్రబృందం హైదరబాద్​ తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడ రెండో షెడ్యూల్​ ముగించుకుని అప్పుడు అమెరికా వెళ్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్​, మహేష్‌​ బాబు జీఎంబీ ఎంటర్​టైనర్స్​, 14 రీల్స్​ ప్లస్​ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus