తమిళంలో స్టార్ హీరో స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్న ధనుష్ తెలుగులో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ధనుష్ నటించిన సినిమాలేవీ తెలుగులో సక్సెస్ సాధించలేదు. తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సర్ పేరుతో ధనుష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ అవుతోంది.
సర్ కథ 1990 సంవత్సరం సమయంలో జరిగే కథ అని ఆ సమయంలో కొన్ని ప్రముఖ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీలలో ప్రభుత్వ లెక్చరర్లతో పాఠాలు చెప్పించి ప్రభుత్వ కాలేజీలపై ఏ విధంగా పై చేయి సాధించారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను టార్గెట్ చేసి వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమాకు కూడా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు విడాకుల ప్రకటన వల్ల ధనుష్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఐశ్వర్య ధనుష్ లను కలపడానికి రజనీకాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం అందుతోంది. ఐశ్వర్య, ధనుష్ కలవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి వీళ్లిద్దరూ కలుస్తారో లేదో చూడాల్సి ఉంది. కొత్త ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు విడాకుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ధనుష్ తన సినిమాల ప్రమోషన్లలో విడాకుల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఐశ్వర్య విడాకులు కోరడంతో ధనుష్ అంగీకరించాల్సి వచ్చిందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విడాకుల వార్తలు ధనుష్ కెరీర్ పై కూడా ప్రభావం చూపుతున్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు ధనుష్ తెలుగులో సక్సెస్ కావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!