‘టక్ జగదీష్’ సినిమాలో థీమ్ సాంగ్‌గా ‘టక్’ అనే పాటను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. దానికి ప్రచారంగా పనికొస్తుందని ఓ చిన్న వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఆ పాటను తొలుత నానిని పాడమందామని దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు గోపీసుందర్ ప్రయత్నించగా… ఆఖరికి శివనే పాడాల్సి వస్తుంది. నిజంగా బయట కూడా ఇలానే జరిగిందా… కావాలని వీడియో చేశారా అనే అనుమానం రాకమానదు. దీనికి శివ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
అప్పుడప్పుడు పాటలు రాస్తారు కానీ, పాటలు పాడరట. కానీ ‘టక్ జగదీష్’ కోసం అనుకోకుండా పాడాల్సి వచ్చిందట. సంగీత దర్శకుడు గోపీసుందర్‌తో రీరికార్డింగ్ పనులు చూస్తున్నప్పుడు ఓ చోట చిన్న బిట్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించిందట శివకి. తనకున్న చిన్నపాటి సాహిత్యానుభవంతో పాట రాసి, పాడి వినిపిస్తే… నాని బాగుందన్నారట. అయితే ఆ పాటను మరొకరితో పాడిద్దామని తొలుత అనుకున్నారట. కానీ నాని… ‘శివ నువ్వే ఈ పాట పాడేయ్’ అన్నారట. అలా పాట పాడారట శివ.
నాని.. ఈ సినిమాను ఓకే చేసే సమయంలోనూ ఇదే జరిగిందట. ‘మజిలీ’ అయిన వెంటనే నానికి ‘టక్ జగదీష్’ కథ చెప్పాలని శివ అనుకున్నారట. ఒక రోజు నాని ఆఫీసుకి వెళ్లి కథ చెప్పారట. కథ వినగానే నానికి బాగా నచ్చి చేసేద్దామన్నారట. నిజానికి కథ వినడానికి వచ్చేటప్పుడు నాని.. శివకి ‘నో’ చెప్పాలనే అనుకున్నారట. కారణం అంతకుముందు శివ చేసినవన్నీ… ప్రేమకథలే. మళ్లీ అలాంటి కథే చెబుతానేమో అని వద్దునుకున్నారట. కానీ భూదేవిపురం, భూకక్షలు అని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి… కథ విని ఓకే చేశారట నాని.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!