టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి RRR సినిమా తర్వాత తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్లో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ ని అయినా రిజెక్ట్ చేశారు అంటే ఆ డైరెక్టర్ తదుపరి సినిమా తప్పకుండా ఫ్లాప్ అవుతుందనే న్యూస్ వైరల్ గా మారింది.
గతంలో వక్కంతం వంశీ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయాల్సి ఉండగా ఆయన చెప్పే కథ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేశారట అనంతరం ఆయన తీసినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఇకపోతే RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయాల్సి ఉండగా త్రివిక్రమ్ చెప్పినటువంటి కథకు ఎన్టీఆర్ కనెక్ట్ కాకపోవడంతోనే త్రివిక్రమ్ తో సినిమాని రిజెక్ట్ చేశారట త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు.
అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు ఎన్టీఆర్ (Jr NTR) ఏ డైరెక్టర్ నైనా రిజెక్ట్ చేశారు అంటే ఆ డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!