Namrata: నమ్రతకు కోపం వస్తే అలా చేస్తుందా?

  • September 14, 2023 / 12:49 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మహేష్ బాబు నమ్రత జంట ఒకటని చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలా ఈ జంట ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకోవడంతో మహేష్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావడం సర్వసాధారణం దీంతో ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు నమ్రత మధ్య కూడా ఇలాంటి గొడవలు తరచూ వస్తూ ఉంటాయని తెలుస్తుంది. ఇక కొన్నిసార్లు నమ్రత మహేష్ బాబు చేసే పనుల పట్ల తనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారట.

ఇలా మహేష్ బాబు చేసే పనుల వల్ల నమ్రతకు కనుక కోపం వస్తే ఆమె ఏమాత్రం మహేష్ బాబుతో పోట్లాడకుండా ఎంచక్కా షాపింగ్ కి వెళ్ళిపోతారట. ఈ విధంగా నమ్రత మహేష్ బాబు పై కోప్పడిన తనతో గొడవ జరిగిన ఈమె షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తారట అప్పటికే తన మనసు ప్రశాంతంగా మారిపోతుందని తెలుస్తుంది.

ఈ విధంగా నమ్రత  (Namrata) మహేష్ బాబుతో గొడవపడి షాపింగ్ కి వెళ్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు చాలా లక్కీ హస్బెండ్ అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus