ఎఫైర్ న్యూస్ లు అనేవి అన్ని చోట్లా సర్వసాధారణమైనవే..! సినిమా పరిశ్రమలో ఇవి ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటాయి. హీరో, హీరోయిన్ లేదంటే హీరోయిన్, డైరెక్టర్ లేదా నిర్మాత ఇతర నటీనటులు రిలేషన్ వంటి వారి ఎఫైర్ వార్తలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. అవి నిజమని కచ్చితంగా చెప్పలేము. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని అవి ప్రచారంలో ఉంటాయి. అయితే IAS, IPS, IRS స్థాయి అధికారులతో హీరోయిన్ లు ఎఫైర్ లు నడుపుతారు అని ఊహించలేము. అలాంటిదే ఇప్పుడు జరిగింది.
వివరాల్లోకి వెళితే..నవ్య నాయర్.. అనే మలయాళ నటిని ఎన్.ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో విచారించడం జరిగింది. మరోపక్క ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్.. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని కాల్ లిస్ట్, చాటింగ్ లిస్ట్ లో నవ్య నాయర్ తో రొమాంటిక్ చాటింగ్ చేసినట్టు బయటపడింది. అందుకే నవ్య నాయర్ ను ముంబాయికి పిలిపించి విచారించిన ఈడీ…
ఈమెకు బంగారం, బంగ్లాలు వంటి గిఫ్ట్ లు సచిన్ సావంత్ నుండి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నవ్య కోసం ఇతను సచిన్ సావంత్ 10 సార్లు పైనే కొచ్చిన్ కి వచ్చినట్లు ఈడీ గుర్తించింది. అయితే నవ్య మాత్రం ‘మా మధ్య బలమైన ఫ్రెండ్షిప్ ఉండటం వల్లే సచిన్ బంగారం, బంగ్లాలు వంటివి ఇచ్చినట్లు చెప్పింది.ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.