Goodachari 2: ‘గూఢచారి 2’ : రూ.55 కోట్లు అనుకుంటే.. అంత పెరిగిందా.!

‘క్షణం’ (Kshanam) తర్వాత అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కిన ‘గూఢచారి’ (Goodachari) చిత్రం.. అతనికి మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. అప్పటివరకు శేష్ మార్కెట్ రూ.2, రూ.3 కోట్లు మాత్రమే ఉండేది. అయితే ‘గూఢచారి’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.10 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల శేష్ కి.. ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. నిజానికి ‘గూఢచారి’ చిత్రాన్ని రూ.5 కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కించాడు దర్శకుడు శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) .

Goodachari 2

ఇక ‘గూఢచారి’ కి సీక్వెల్ కూడా ఉంటుందని ఆ టైంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జి2’ (Goodachari 2) పేరిట ఈ సీక్వెల్ రూపొందుతుంది. అయితే ఈ సీక్వెల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రెండో పార్ట్ ను ‘గూఢచారి’ కి ఎడిటర్ గా చేసిన వినయ్ కుమార్ శిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే అడివి శేష్ అందిస్తున్నారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మొదటి పార్ట్ హిట్ అవ్వడం, శేష్ కి ‘మేజర్’ (Major) తో పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడటంతో, ఈ చిత్రానికి (Goodachari 2) బడ్జెట్ కూడా పెరిగిపోతోందట. ఈ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీని తీసుకున్నారు. ఇంకా చాలా మంది పాన్ ఇండియా నటులు కనిపిస్తారట. సో మొత్తంగా ఈ చిత్రానికి రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందట. మొదట రూ.55 కోట్లు బడ్జెట్ అనుకున్నారట. అది రూ.100 కోట్ల వరకు పెరిగినట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus