ఈ రిస్క్ లు అవసరమా బన్నీ..!

అల్లు అర్జున్ ఈ ఏడాది త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ‘అల వైకుంటపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు బన్నీ. ‘రంగస్థలం’ తరువాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడం.. మరో పక్క బన్నీ కూడా ‘అల వైకుంటపురములో’ తరువాత చేస్తున్న చిత్రం కావడంతో.. ‘పుష్ప’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప రాజ్ పాత్రలో చాలా రస్టిక్ గా కనిపించనున్నాడు బన్నీ.

ఇక ఈ చిత్రం పూర్తయ్యాక కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి బన్నీ రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కు బన్నీ ఓకే చెప్పినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ వంటి డీసెంట్ హిట్లను అందుకున్న మహి.వి.రాఘవ.. ఈ మధ్యనే బన్నీకి ఓ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. పొలిటికల్ నేపధ్యంలో సాగే కథ ఇదని తెలుస్తుంది.

ఇప్పటి వరకూ బన్నీ అలాంటి పాయింట్ తో సినిమా చెయ్యలేదు కాబట్టి ఇంప్రెస్ అయిపోయినట్టు టాక్.ఇది పక్కన పెడితే ‘రాజకీయ నేపధ్యంలో సాగే సినిమా బన్నీకి సెట్ అవ్వదు.. రిస్క్ చేస్తున్నాడేమో’ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మరోపక్క వేణు శ్రీరామ్ కూడా బన్నీతో ‘ఐకాన్’ అనే సినిమా చెయ్యాలని చాలా రోజుల నుండీ వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో బన్నీ ఎవరికి మొదట ఛాన్స్ ఇస్తాడో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus