స్టార్ సినిమాలకు మ్యూజిక్ ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు. కథకు తగ్గట్టు సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరుగుతాయి. కోలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ మెస్మరైజ్ చేస్తుంటే, టాలీవుడ్‌లో ఆయన హవా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు రజినీకాంత్ (Rajinikanth) , కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ తన మార్క్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. తెలుగులో ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాకు అనిరుధ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సినిమా చూసినవారంతా బీజీఎమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఈ విజయం తర్వాత, చిరంజీవి (Chiranjeevi) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) చేయబోయే సినిమాతో పాటు, బాలయ్య గోపిచంద్ మలినేనితో (Gopichand Malineni) చేస్తున్న ప్రాజెక్ట్‌లో అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే ఈ సినిమాలకు మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక అనిరుధ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు టాక్.
ఎన్టీఆర్ ‘దేవర 1’ కోసం ఈ అంత కంటే ఎక్కువే తీసుకున్నట్లు ప్రచారం. అయితే, మంచి కథ ఉన్న ప్రాజెక్ట్‌లకు రెమ్యునరేషన్ తగ్గించేందుకు ఆయన సిద్ధమని కూడా టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో మరింత బిజీగా మారాలని అనిరుధ్ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, సూపర్‌స్టార్ ప్రాజెక్ట్‌లకు ఆయన కాస్త తక్కువ రేటుకు ఒప్పుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, ఒకేసారి చిరు, బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తే, అది టాలీవుడ్‌కు పెద్ద విజయమవుతుందని భావిస్తున్నారు.
అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం, ముఖ్యంగా బీజీఎమ్, సినిమాకు 50% హిట్ ఇమ్పాక్ట్‌ను తీసుకువస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన మ్యూజిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టాలీవుడ్ లో రాబోయే సినిమాలకు 8 కోట్ల రేంజ్ లోనే ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక చిరు, బాలయ్య ప్రాజెక్ట్‌లలో అనిరుధ్ నిజంగా పని చేస్తాడా, లేక ఈ వార్తలంతా పుకార్లా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.