Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ రుణం అలా తీర్చుకుంటున్నావా బాస్‌!

అగ్ర నటులు, స్టార్‌ హీరోలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం మనకు కొత్త కావొచ్చు… బాలీవుడ్‌లో ఇది పాత విషయమే. అయితే చాలా విషయాల్లో బాలీవుడ్‌ను దాటేస్తున్న టాలీవుడ్‌ ఈ విషయంలో ఇంకా తొలి అడుగుల్లోనే ఉంది. ఒక్క స్టార్‌ హీరో ఇలాంటి స్టెప్‌ వేస్తే.. మన దగ్గర ఓటీటీ ట్రెండ్‌ ఇంకా బలంగా జనాల్లోకి వెళ్తుంది. దీనికి తొలి అడుగు వెంకటేశ్‌ వేస్తున్నారు. ‘రానా నాయుడు’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారాయన. అయితే ఇప్పుడు చిరంజీవి ఈ అడుగుల్లో ముందుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

అదేంటి.. చిరంజీవి ఓటీటీలోకి రావడం గురించి బాలీవుడ్‌లో చర్చ ఏంటి అనుకుంటున్నారా? మీ డౌట్‌ కరెక్టే.. కానీ నిర్మాత అక్కడాయన కాబట్టి అక్కడ చర్చ నడుస్తోంది. ఆ నిర్మాత ఎవరో కాదు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌. చిరంజీవి ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందించాలని సల్మాన్‌ అనుకుంటున్నాడట. ఆ మధ్య ‘గాడ్‌ ఫాదర్‌’ సమయంలో ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చ కూడా సాగింది అంటున్నారు.

బాలీవుడ్ వర్గాల నుండి గత కొన్ని రోజులుగా అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నట్లు సమాచారం. నెట్ ప్లిక్స్ కోసం సల్మాన్‌ ఓ భారీ సిరీస్‌ ప్లాన్‌ చేశాడని, అందులో నటించడానికి చిరంజీవిని ఒప్పించాడని అంటున్నారు. ఇంకొందరైతే అది సిరీస్‌ కాదని, రియాలిటీ షో అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చిరంజీవి వెబ్ సిరీస్‌ అనేసరికి ఆసక్తి అయితే పెరిగింది. మరి ఈ విషయం నిజమేనా? చిరంజీవి చేస్తారా అనేది ఆసక్తికరం.

అన్నట్లు మొన్నీమధ్యే మాట్లాడుతూ నటుల విషయంలో సాధారణంగా ‘ఇమేజ్‌ ఈజ్‌ లార్జర్‌దేన్‌ దేర్‌ లైఫ్‌’ అంటుంటారు. దాన్ని తాను తిరగరాయాలనుకుంటున్నాను అని అన్నారు. అంటే తనను తాను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’తో ఓ ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తారేమో చూడాలి. అన్నట్లు సల్మాన్‌కు ఓ గిఫ్ట్‌ ఇవ్వాలి అని ఆ మధ్య చిరు అన్నారు. అది ఇదేనేమో మరి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus