‘సత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది జెనీలియా. పదేళ్ల కెరీర్ లో ఎన్ని సినిమాలు, పాత్రలు చేసినా హాసినిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జెనీలియా తన తొలి చిత్ర కథానాయకుడు, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈ ముంబై భామ ఓ తమిళ చిత్రంతో మళ్ళీ తెరపైకి రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సంతానం హీరోగా తెరకెక్కిన ‘దిల్లుకు దుడ్డు’ సినిమా దర్శకుడు రామ్ బాల తన తాజా చిత్రానికి జెనీలియను ఎంచుకున్నట్టు కోలీవుడ్ వర్గాల టాక్. పెళ్ళైన తర్వాత ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే చేసింది జెన్నీ. ఈ వార్త గనక నిజమైతే జెన్నీ రీ ఎంట్రీ సినిమా ఇదే అవుతుంది. అయితే దర్శకుడి వాదన మరోలా వుంది. తన కథలోని పాత్రకు జెనీలియా లాంటి బబ్లీ నటి ఉండాలి అన్నానే తప్ప జెనీలియా కాదని అంటున్నాడు. అదీ అసలు విషయం.