Chiranjeevi: మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన డేట్.. ‘హరిహర వీరమల్లు’ సంగతేంటో?

సినీ పరిశ్రమ అంటేనే చాలా సెంటిమెంట్లను ఫాలో అయ్యే పరిశ్రమ అని చెప్పాలి. ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి దానికి గుమ్మడికాయ కొట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే వరకు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతారు మేకర్స్. ఈ క్రమంలో అభిమానులకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. తమ అభిమాన హీరోల సినిమాలు ‘పలానా టైంలో వస్తే బాగుంటుంది.. అప్పుడు బాగా ఆడతాయి’ అంటూ సోషల్ మీడియాలో తరచూ డిస్కషన్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీటిని గమనించి.. క్యాష్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతల వద్ద ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు.

Chiranjeevi

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. మెగా హీరోలకి కూడా కొన్ని రిలీజ్ డేట్లు బాగా కలిసొస్తాయి అనే సెంటిమెంట్ అభిమానుల్లో ఉంది. చిరంజీవికి మే 9, మే 11 రిలీజ్ డేట్లు కలిసొస్తాయి అనే సెంటిమెంట్ ఉంది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ‘గ్యాంగ్ లీడర్’ ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాలు ఆ డేట్లకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి.

సరిగ్గా ఇలానే జూలై 24 కూడా మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందని మెగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఇదే డేట్ కి ముందుగా పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ వచ్చింది. 1998 జూలై 24న రిలీజ్ అయిన ఈ సినిమా చాలా సైలెంట్ గా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. పవన్ కళ్యాణ్ కు అంతకు ముందు హిట్లు ఉన్నాయి. కానీ ‘తొలిప్రేమ’ తోనే అతను సోలో హీరోగా నిలబడ్డాడు. అలాగే 2002 జూలై 24న చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ అయ్యింది.

అప్పటికి చిరంజీవి ‘మృగరాజు’ ‘డాడీ’ వంటి డిజాస్టర్స్ తో చాలా డౌన్లో ఉన్నారు. అలాంటి టైంలో వచ్చిన ‘ఇంద్ర’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరుకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. ఇక ఈ 2025 జూలై 24కి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో వచ్చారు. దీనికి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది కానీ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే నమోదవుతున్నాయి. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయితే జూలై 24 అనేది మెగా హీరోలకి కూడా సెంటిమెంట్ గా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

‘హరిహర వీరమల్లు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus