Kayadu Lohar: కయాదును హర్ట్ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్’ ఎందుకిలా చేస్తోంది?
- September 21, 2026 / 12:19 PM ISTByFilmy Focus Desk
‘ప్యారడైజ్’ సినిమాలో కయాదు లోహర్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్న వేస్తే.. – మాకేం తెలుసు. టీజర్‌లో ఆమె గురించి ఏమన్నా చెప్పారా? పోస్టర్లలో ఏమన్నా డీటెయిల్స్ చూపించారా? ప్రచారంలో ఏమన్నా ఆమె మాట్లాడిందా? అసలు ప్రచారానికి వచ్చిందా? పోనీ సినిమా టీమ్ ఎవరైనా ఆమె గురించి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారా? ఇలాంటి ఆన్సర్‌లు చాలానే వస్తాయి మీ దగ్గర నుండి. వీటన్నింటి కంటే ఓ పెద్ద ప్రశ్న ఇప్పుడు సినిమా టీమ్ ఎదుట వచ్చింది.
Kayadu Lohar
అదే ‘వేర్ ఈజ్ కయాదు లోహర్’. ‘ప్యారడైజ్’ సినిమా ప్రారంభమై హీరోయిన్ కయాదు లోహర్ అని తేలడంతో సినిమా మీద హైప్ కాస్త బాగానే పెరిగింది. ఎందుకంటే కయాదు గ్లామర్, లుక్స్ సినిమాలకు కలిసొస్తాయి అని అనుకున్నారంతా. కానీ ఆమెను సినిమా ప్రచారంలో ఎక్కడా వాడటం లేదు. పోస్టర్లలో, ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో ఆమె కనిపించడం లేదు. దీంతో కయాదును సినిమా టీమ్ హర్ట్ చేసిందా? లేక ‘ప్యారడైజ్’ టీమ్‌ని కయాదు హర్ట్ చేసిందా అనే డౌట్స్ వస్తున్నాయి.
‘ప్యారడైజ్’ సినిమా తెలుగు ప్రచారంలో కయాదు లేకపోయినా ఫర్వాలేదు కానీ.. తమిళ ప్రచారంలో మాత్రం ఆమె కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కోలీవుడ్‌లో కయాదుకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. అలాంటిది చెన్నైలో ఈవెంట్ పెట్టినా ఆమెను తీసుకురాలేకపోయారు/ ఆమె రాలేదు. అన్నట్లు ఓ విషయం ఆ ఈవెంట్ సమయానికి ఆమె చెన్నైలోనే ఉండటం గమనార్హం.
ఇదంతా చూస్తుంటే అయితే ఆమె పాత్రను మీడియాకు, ప్రేక్షకులకు దూరంగా ఉంచుతున్నారు. లేదంటే టీమ్ మధ్య వచ్చిన ఇబ్బందులు కారణం అని చెప్పొచ్చు. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా విడుదల కావాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె నుండి క్లారిటీ ఆటోమేటిగ్గా వస్తుంది. అన్నట్లు సినిమా టీమ్ రీసెంట్ సోషల్ మీడియాలో ఆమె పేరు కూడా ఎక్కడా కనిపించడం లేదు. హ్యాష్ ట్యాగ్ కూడా లేదు. ఇదంతా చూస్తుంటే ఏదో జరిగినట్లే ఉంది అనిపిస్తోంది.















