కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇటీవల అంటే డిసెంబర్ 12న తన ప్రియుడు ఆంటోనీతో ఏడు అడుగులు వేసింది. గోవాలో ఈమె ఆంటోనీని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిస్టియన్ అయినటువంటి ఆంటోనీని కీర్తి సురేష్ మొదట హిందూ సంప్రదాయంలో పెళ్ళి చేసుకుంది. అటు తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. ఒక రకంగా ఇది విశేషంగానే చెప్పుకోవాలి. వధూవరులు ఇద్దరూ ఒకరి సంప్రదాయాన్ని మరొకరి గౌరవిస్తూ నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. 15 ఏళ్ళుగా ఆంటోనీ – కీర్తి ప్రేమలో ఉన్నారు.
వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఆంటోనీ పూర్తి పేరు ఆంటోనీ తటిల్. ఇతను దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్ అని తెలుస్తుంది. అలాగే ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు కూడా.! ఇక కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్.ఎన్ని ఫ్లాపులు పడినా ఈమె రేంజ్ వేరు. ఇప్పటికీ ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. శ్రీలీల (Sreeleela) , భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) వంటి కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ కీర్తి సురేష్ రేంజ్ ఏమీ తగ్గలేదు.
‘దసరా’ (Dasara) వంటి హిట్లు ఇస్తూ తన రేంజ్ ఏంటనేది చెబుతూనే వచ్చింది. ఈ మధ్య బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది. అయితే.. పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా లేదా? అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం. సాధారణంగా బిజినెస్మెన్ లను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ సినిమాలు చేసినా.. చాలా కండిషన్స్ పెట్టుకునో, లేక గ్యాప్ ఇస్తూనే చేస్తుంటారు. మరి కీర్తి నిర్ణయం ఎలా ఉందో తెలియాల్సి ఉంది