KGF Movie: ‘కేజీయఫ్‌ 2’ వస్తుందిగా… కాస్త వెనక్కి వెళ్లి చూద్దాం!

  • April 10, 2022 / 11:49 PM IST

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌)… ఇదొక ప్రాంతం ఉందని కర్ణాటకలో చాలామంది తెలుసు. మన పాత తరం వాళ్లకు కూడా తెలిసే ఉంటుంది. అయితే నేటి తరం వాళ్లకు తెలిసింది అంటే దానికి కారణం ‘కేజీయఫ్‌’ సినిమానే. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన చిత్రం విడుదల అనేసరికి… ఆ ప్రాంతం గురించి చర్చ మొదలైంది. సినిమా విడుదలయ్యాక దాని గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ‘కేజీయఫ్‌ 2’ విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అసలు నిజమేనా? ఈ సినిమా కథ అక్కడ జరిగిందా అంటూ చర్చ మొదలైంది. కాబట్టి ఆ కేజీయఫ్‌ గురించి మరోసారి చూద్దాం! కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో కేజీయఫ్‌ ఉంది. కోలార్‌ నగరానికి 30 కి.మీ, బెంగళూరుకు 100 కి.మీ దూరంలో ఉన్నాయి. సుమారు 100 ఏళ్లపాటు ఆ ప్రాంతంలో బంగారం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర మాట. 2001 నుండి ఇక్కడ తవ్వకాలు నిలిపేశారు. ఆ గనుల్లో బంగారం అంతరించిపోవడమే కారణమని చెబుతుంటారు.

కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే కోలార్‌లో బంగారు గనులు ఉన్నట్లు చరిత్ర సారాంశం. ఆంగ్లేయులతో టిప్పు సుల్తాన్‌ పోరాటం జరిపి… కన్నుమూసిన తర్వాత మైసూర్‌ ప్రాంతం బ్రిటిష్‌ వశమైంది. ఆ సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జాన్‌ వారెన్‌… కోలార్‌ ప్రాంతం మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఓ పుసక్తంలో రాసుకొచ్చారు. అక్కడ బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్థుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు.

ఎక్కువ మొత్తంలో మట్టిని సేకరించి పరిశీలించాడు. అయితే అతి తక్కువ మొత్తంలో అక్కడ బంగారం ఉందని, ఇది ఒక వృథా ప్రయత్నమేనని భావించి మధ్యలోనే తన ప్రయత్నం ఆపేశాడు. అయితే 1850 తర్వాత వారెన్‌ రాసిన పుస్తకాన్ని లావెల్లీ అనే బ్రిటిష్‌ అధికారి చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించాడు. కొన్ని రోజులకు జాన్‌ టేలర్‌ కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలకు అవసరమైన విద్యుత్‌ కోసం ఓ భారీ పవర్‌ ప్లాంట్‌ను కూడా అక్కడ నిర్మించారు.

30,000 మంది కార్మికులు ఈ ఫీల్డ్స్‌లో పని చేసేవారట. 2001 వరకు అక్కడ తవ్వకాలు జరిగాయి. బంగారు గనుల ప్రాంతాన్ని దక్కించుకోవడం కోసం వ్యక్తుల మధ్య జరిగిన పోరాటాలను, అందులో పనిచేసే కార్మికుల చీకటి జీవితాలను ‘కేజీయఫ్‌’లో చూపించారు. దీంతో అక్కడ ఇలాంటి పరిస్థితులే ఉండేవా? అని చర్చ మొదలైంది. అయితే ఆనాటి కేజీయఫ్‌కు… సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది చిత్రబృందం. అదన్నమాట ఒరిజినల్‌ కేజీయఫ్‌ కథ. సినిమా కేజీయఫ్‌తో ఎలాంటి సంబంధం లేదు. కేవలం పేరు మాత్రమే వాడుకున్నారన్నమాట.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus