Maharani: సేతుపతికి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చి.. ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ కోసం..

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) చాలా మంది యాక్టర్‌. ఎన్నో హిట్‌ సినిమాలు చేశారు. అయితే ఆయనకు, ఆయన అభిమానులకు గుర్తుండిపోయే సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఇక వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చిన సినిమాలు అయితే లేవనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆయన తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన సినిమా ‘మహారాజా’. ఈ సినిమా సాధించిన వసూళ్లు, ఘనతలు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ‘మహారాణి’ (Maharani) రాబోతోంది అనేది లేటెస్ట్‌ పాయింట్‌.

Maharani

అంచనాలు లేకుండా.. సైలెంట్‌గా నార్మల్‌ సినిమాలా వచ్చి సూపర్ హిట్ సాధించిన ‘మహారాజా’ దర్శకుడు నితిలన్‌ స్వామినాథ్‌ కొత్త సినిమా రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. ఈసారి కూడా ఇంచుమించు అదే జోనర్‌లో సినిమా చేయబోతున్నారడట. ఇందులో నయనతార (Nayanthara) ‘హీరో’యిన్‌గా నటించనుంది అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ‘మహారాణి’ అనే పేరు పరిశీలనలో ఉంది అని సమాచారం.

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌ మీదే సినిమాను నిర్మిస్తారు అని కూడా అంటున్నారు. ‘మహారాజా’ హిట్టయ్యింది కాబట్టి.. ‘మహారాణి’ (Maharani)  అని పేరు పెట్టడం లేదని, సినిమా కథకు తగ్గట్టుగా ఆ పేరు పెడుతున్నారు అని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. మరోవైపు నయనతార ‘మూకుత్తి అమ్మన్‌’ / ‘అమ్మోరు తల్లి’ సినిమాకు కొనసాగింపుగా ‘అమ్మోరు తల్లి 2’ సిద్ధం చేయాలని చూస్తున్నారు. తొలి సినిమాను ఆర్‌జే బాలాజీ  (RJ Balaji)  , ఎన్‌.జె.శరవణన్‌ డైరెక్ట్‌గా చేయగా..

ఈసారి దర్శకుడిగా సి.సుందర్‌ (Sundar C) వ్యవహరించనున్నట్లు సమాచారం. ‘బాక్‌’ (BAAK)/ ‘అరణ్మనై 4’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన సుందర్‌ ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చేయడానికి ఓకే చెప్పారు అని సమాచారం. ఇవి కాకుండా నయనతార చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా లెవల్‌లో నయన్‌ తర్వాతి సినిమాలు చేయబోతోంది. కాబట్టి ఇప్పుడు ‘మహారాణి’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తారు అని అనుకుంటున్నారు.

నా దృష్టిలో వాళ్లే రియల్ హీరోలు అంటున్న పవన్.. ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus