మహేష్‌ – రాజమౌళి సినిమాపై ‘డబుల్‌’ పుకార్లు.. నిజమేనా?

  • January 2, 2023 / 10:26 AM IST

ఒక సినిమా అనుకుని మొదలుపెట్టి.. రెండు సినిమాలుగా మారడం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ‘బాహుబలి’తో మొదలైన ఈ డబుల్‌ సినిమా కాన్సెప్ట్‌ ఆ తర్వాత ‘కేజీయఫ్‌’కి పాకింది. ఈ రెండూ రెండు పార్టులుగా వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. ‘బాహుబలి’ని చూసి సుకుమార్‌ కూడా డబుల్‌ బొనాంజా ఇస్తున్నారు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి. అలా ఇప్పుడు మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి కూడా డబుల్‌ బొనాంజా ఉందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీనికి కారణం సినిమా రచయిత రాజేంద్రప్రసాదే అని అంటున్నారు.

రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక బ్లాక్‌బస్టర్‌ విషయం బయటికొస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌బాబు – రాజమౌళి సినిమా ఒకటి కాదు, చాలా అవ్వొచ్చు అని చెప్పారు. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే రాజమౌళితో మా హీరో ఒక సినిమా చేయడమే హ్యాపీ అనుకునే వాళ్లకు వరుస సినిమాలు అని తెలిస్తే ఆనందించకుండా ఉంటారా?

అయితే మరోవైపు అన్ని సినిమాలు అంటే మహేష్‌ తరచుగా థియేటర్లకు రాడు కదా అని నిట్టూరుస్తున్నారు కూడా. ‘‘మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్‌ ఫ్రాంఛైజీగా తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఈ సినిమాకు వరుసగా సీక్వెల్స్‌ వస్తుంటాయి. సీక్వెల్స్‌లో కథలు మారొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు అవే ఉంటాయి. ప్రస్తుతం పార్ట్‌ 1 స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నాం’’ అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. అయితే ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది అంటున్నారు.

వన్స్‌ ఓకే అయితే సినిమా ముహూర్తం నాడే చెప్పేస్తారు అని అంటున్నారు. అలా రాజమౌళి సినిమా కేవలం 29 మాత్రమే కాదు 30 కూడా అవ్వొచ్చు అంటున్నారు. అయితే రెండు వరుస సినిమాలు రాజమౌళికి మహేష్‌ ఇస్తాడా అనేది చూడాలి. ఇండియానా జోన్స్‌ తరహా సినిమా ఇది రాజమౌళి ఇప్పటికే చెప్పారు. ఇండియా జోన్స్‌ సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. అలాంటి బ్యాక్‌డ్రాప్‌ మరి ఆ సిరీస్‌ది. మరిప్పుడు రాజమౌళి ఎన్ని తీస్తారో చూడాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus