వాయిదాలు పడుతూ, పడుతూ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఒకటి, రెండు రోజులు షూటింగ్ అయ్యాక టీమ్‌లో ఎవరికో కరోనా వచ్చిందని వాయిదా వేసేశారు. దీంతో మహేష్‌బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఓవైపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పనులు చూస్తూ, మరోవైపు కొత్త సినిమా కథలు వింటున్నాడట. ఇటీవల మహేష్‌కు ఇద్దరు, ముగ్గురు కథలు వినిపించారట. అయితే వాటి మీద మహేష్ ఏ నిర్ణయం తీసుకున్నాడనేది తెలియదు.
మహేష్‌కు కథలు వినిపించినవారిలో ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగర ప్రసాద్ ఉన్నారట. ‘గురు’సినిమాలో తెలుగులో దర్శకురాలిగా అరంగేట్రం చేశారు సుధ. ఇటీవల సూర్యతో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ విజయంతో ఆమెపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో అజిత్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేయబోతున్నారామె. ఆ తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సినిమా డిస్కసన్ నడుస్తోందట.
తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ నిలిచిపోవడంతో మహేష్ ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో వీడియో కాల్‌లో సుధతో టచ్‌లో ఉన్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఆఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. అయితే మహేష్ ప్రజెంట్ డైరీ చూస్తే అది కష్టంగానే కనిపిస్తోంది. మహేష్ సినిమాల వరుసలో త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలున్నాయి. దీంతో 2023లో అయినా వీరి సినిమా పట్టాలెక్కొచ్చు. అంతకుముందు సినిమా కథ ఓకే అవ్వాలి.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!