‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ప్రభాస్ స్టార్ ఇమేజ్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సంక్రాంతి సినిమాలు వచ్చాక.. ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్ పడిపోయాయి. సంక్రాంతి సెలవులు ఈ సినిమాకి ఏమాత్రం హెల్ప్ చేయలేదు.ఇప్పటికీ పర్వాలేదు అనిపించే రేంజ్లో కలెక్ట్ చేస్తున్నా.. బయ్యర్స్ ఒడ్డుకు చేరే మార్గం అయితే కనిపించడం లేదు.
సో బాక్సాఫీస్ రిజల్ట్ ప్రకారం ‘ది రాజాసాబ్’ అనేది ప్రభాస్ కెరీర్లో పెద్ద డిజాస్టర్ మూవీ అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమా ఫలితాన్ని ఎవరు మోయాలి? అనే ప్రశ్నపైనే ఇప్పుడు చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుండి ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతీని, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. సినిమా ఆడలేదు కాబట్టి… వాళ్లకి ఉన్న ఫ్రస్ట్రేషన్ తో మారుతీ,ఎస్ కె ఎన్..లను తిట్టిపోస్తున్నారు. ఓకే..!
అయితే ఈ సినిమా ఫలితం భారం మొత్తం వాళ్ళే మోయాలా?ఈ ప్రశ్నపై కూడా కొంత చర్చ జరుగుతుంది. దీన్ని కూడా కొంచెం పరిశీలిస్తే.. ‘ది రాజాసాబ్’ సినిమాకి రూ.400 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. మరి ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా వస్తుందని తెలిసినా.. సంక్రాంతికి పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాంటప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్లో జరగాలి? ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే జనాలు మాట్లాడుకునే విధంగా ఉండాలి.
కానీ అలాంటిదేమీ జరగలేదు. ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ముఖ్యంగా సినిమా సగం హిట్ అనిపించుకోవడానికి.. మ్యూజిక్ హెల్ప్ అవ్వాలి. ‘ది రాజాసాబ్’ విషయంలో అది కూడా జరగలేదు. దర్శకుడు మారుతీ, హీరోయిన్లు రెగ్యులర్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవి ప్రమోషన్స్ కి హెల్ప్ అవ్వలేదు సరి కదా.. దర్శకుడు మారుతీ మాట్లాడిన విధానం ప్రభాస్ అభిమానులకు నచ్చలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకుంటే.. ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’ అంటూ పరోక్షంగా పెద్ద కౌంటర్ వేశాడు.
ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో చూసుకుంటే.. ‘ప్రభాస్ హీరోయిన్స్ తో వచ్చే కాంబినేషనల్ సీన్స్ లో మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాడు, సజెషన్ షార్ట్స్ కి బాడీ డబుల్ ని వాడాం’ అని చెప్పి విషం చిమ్మాడు. తర్వాత ‘ది రాజాసాబ్’ స్క్రిప్ట్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యాడని… చాలా మార్పులు కోరాడని, సినిమా ఎలా వచ్చినా దానికి కారణం ప్రభాసే అన్నట్టు ఎస్కేపిజం ప్లాన్ చేశాడు మారుతీ. అందుకే ‘ది రాజాసాబ్’ ఫలితం విషయంలో అభిమానులు ఎక్కువగా అతన్నే బ్లేమ్ చేస్తున్నారు.