Nagarjuna,Puri Jagannadh: నాగార్జున కోసం స్టార్‌ డైరక్టర్‌ కొత్త కథ… ఈసారి ఎలా ఉంటుందో

నాగార్జునకు (Nagarjuna) డిఫరెంట్‌ ఇమేజ్‌, డిక్షన్‌, యాటిట్యూడ్‌ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఒకరు. ‘నా పేరు శివమణి.. నాక్కొంచం’ మెంటల్‌ అని ఆయన అన్నాడంటే అది పూరి జగన్‌ వల్లనే. నాగ్‌తో అలాంటి సినిమా చేయొచ్చని ఎవరూ ఊహించని సమయంలో ఆయన చేసి చూపించారు. ఆ తర్వాత ‘సూపర్‌’ (Super) అంటూ మరో ప్రయత్నం చేస్తే అది ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. అయితే ఆ ప్రయత్నం నాగ్‌ ఫ్యాన్స్‌కి నచ్చింది.ఇప్పుడు నాగ్‌ – పూరి గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అనే పుకార్లు వస్తుండటమే.

‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమా తర్వాత పూరి ఏం సినిమా చేస్తారు అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. చాలామంది హీరోల పేర్లు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో హీరో పేరు వినిపించింది. అతనే కింగ్‌ నాగార్జున. గతంలో నాగార్జునను ఒకసారి పోలీసును చేయగా, మరోసారి పెద్ద దొంగను చేశారు పూరి జగన్నాథ్‌. దీంతో ఇప్పుడు ఎలా చూపిస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది.

ఎందుకంటే పూరి హీరో సగటు తెలుగు సినిమా హీరోలకు చాలా భిన్నంగా ఉంటాడు. అందుకే నాగ్‌ను ఇప్పుడు ఎలా చూపిస్తాడు అనే విషయంలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిజంగానే ఈ కాంబోలో సినిమా ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్‌’ తర్వాత పూరి సినిమా ఏంటి అంటే ఇప్పటివరకు చిరంజీవి (Chiranjeevi) , బాలకృష్ణ (Balakrishna) పేర్లు వినిపించాయి.

ఇప్పుడు ఇలా నాగార్జున పేరు వచ్చింది. మరి వీరిలో ఎవరవుతారో చూడాలి. ఇక నాగ్‌ అయితే ధనుష్‌ (Dhanush) ‘కుబేర’లో నటిస్తున్నాడు. దాంతోపాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటిలో పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌లు కూడా ఉన్నాయి అంటున్నారు. మోహన్‌రాజాతో తన వందో సినిమా అన్నారు కానీ.. అది అయ్యేలా లేదు అని లేటెస్ట్‌ టాక్‌. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus