సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి మన దేశంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ మధ్య వరకు ఈ విషయం చాలామందికి తెలియదు. ఎప్పుడైతే నయనతార – విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులం అయ్యాం అని ప్రకటించారో అప్పటి నుండి ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇప్పుడు అవే రూల్స్ నయన్ దంపతుల్ని, దాంతోపాటు మరొకరిని జైలుపాలు చేస్తుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నయనతార – విఘ్నేష్ శివన్ సరైన ఆధారాలు ఇవ్వకపోతే ఇదే జరుగుతుంది అంటున్నారు.
తాము తల్లిదండ్రులం అయ్యాం అంటూ.. ఓ పది రోజుల క్రితం నయనతార – విఘ్నేశ్ శివన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి రోజుల్లో దీని గురించి పెద్దగా చర్చ లేదు. అయితే ప్రముఖ నటి కస్తూరి చేసిన ట్వీట్‌తో పరిస్థితి మారిపోయింది. దేశంలో సరోగసీ గురించి కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటూ ఆమె అన్యాపదేశంగా నయన్ – విఘ్నేష్ దంపతుల గురించి మాట్లాడింది. ఆ తర్వాత తమిళనాడు మంత్రి ఒకరు ఈ విషయంలో నయన్ నుండి వివరణ కోరుతాం అని అన్నారు. దీంతో చర్చ మొదలైంది.
సరోగసీ విషయంలో వివరణ కోసం నయనతార దంపతులకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లయింది అని నయన్ వాదిస్తున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. సరోగసీ గురించి అనుమతి తీసుకున్నాం అని కూడా చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తెలుస్తోంది. పెళ్లి అప్పుడెప్పుడో అయినట్లు గానీ, సరోగసీ గురించి అనుమతి తీసుకున్నట్లు కానీ ఎక్కడా ఆధారాలు లేవని అంటున్నారు. ఈ మేరకు నయన్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేరు అని కూడా అంటున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే.. నయనతార దంపతులకు, సరోగసీకి సహకరించిన వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది. దేశంలో సరోగసీ ద్వారా బిడ్డను కనాలి అనుకుంటే.. పెళ్లి అయ్యి ఐదేళ్లు అయి ఉండాలి. బిడ్డలు కనడానికి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తెలియజేయాలి లాంటి నిబంధనలు ఉన్నాయి. నయన్ పెళ్లి అయ్యి నాలుగు నెలలు దాటుతోంది. ఇక రెండో అంశం గురించి క్లారిటీ లేదు. దీంతో ఏమవుతుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!