Nithiin: ఆదిత్య హాసన్ ఫస్ట్ మూవీ ఆ బ్యానర్లోనే అంటే..!?

’90’s’ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Haasan) . మంచి నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించిన వెబ్- సిరీస్..అది. ఎక్కడా వల్గారిటీకి తావివ్వకుండా ఓ బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఆర్టిస్ట్..ల పెర్ఫార్మన్స్..లు కూడా చాలా బాగుంటాయి. సీనియర్ హీరో శివాజీ (Sivaji) సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సిరీస్. అలాగే దీని రైట్స్ తీసుకున్న ఈటీవి విన్ వారికి కూడా భారీగా లాభాలు వచ్చాయి.

Nithiin

ఇక దర్శకుడు ఆదిత్య రైటింగ్ కి టాలీవుడ్ హీరోలు ఇంప్రెస్ అయిపోయి ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ లిస్ట్..లో నితిన్ కూడా ఉన్నాడు. నితిన్   (Nithin Kumar)- ఆదిత్య..ల సినిమా ఫిక్స్ అని ప్రచారం గట్టిగా జరిగింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. కి కూడా ఆదిత్య రైటింగ్ అదిరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘డెడ్ పూల్’ కి కూడా చాలా బాగా డైలాగ్స్ రాశాడు. అన్నీ యూత్ కి బాగా నచ్చాయి. ‘ఈ క్రమంలో ఆదిత్య డైరెక్షన్లో సినిమా ఎప్పుడు చూస్తామా?’ అని అంతా అనుకుంటున్న వేళ ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అదేంటంటే.. నితిన్ – ఆదిత్య..ల ప్రాజెక్టు ఇప్పట్లో సెట్ అయ్యేలా లేదట. నితిన్ (Nithiin) ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ (Robinhood)   ‘తమ్ముడు’ (Thammudu) చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తర్వాత విక్రమ్ కె కుమార్ తో (Vikram kumar) సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో ‘ఆదిత్య సినిమాకి ఎక్కువ టైం పట్టొచ్చు’ అని నితిన్ (Nithiin) పరోక్షంగా తన టీంతో చెప్పించాడట.దీంతో ఆదిత్య ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో తన ఫస్ట్ ఫీచర్ ఫిలిం చేయబోతున్నట్లు సమాచారం.

23 సంవత్సరాల మిత్ బ్రేక్ అయింది.. కార్తికేయ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus