Jr NTR: 23 సంవత్సరాల మిత్ బ్రేక్ అయింది.. కార్తికేయ కామెంట్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Jr NTR)  డైరెక్షన్ లో నటించిన హీరో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కినా ఆ హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. స్టూడెంట్ నంబర్1 (Student No: 1) సినిమా తర్వాత సుబ్బు (Subbu), సింహాద్రి (Simhadri) మూవీ తర్వాత ఆంధ్రావాలా (Andhrawala), యమదొంగ (Yamadonga) తర్వాత కంత్రి (Kantri) సినిమాలతో తారక్ కు ఒకింత నెగిటివ్ ఫలితాలే ఎదురయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజమౌళి (S. S. Rajamouli) నెగిటివ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడని జక్కన్న కొడుకు కార్తికేయ కామెంట్లు చేశారు.

Jr NTR

దేవర సినిమా కర్ణాటక హక్కులను సొంతం చేసుకున్న కార్తికేయ (S. S. Karthikeya) మరో సంస్థతో కలిసి కర్ణాటకలో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కార్తికేయ 23 సంవత్సరాల మిత్ బ్రేక్ అయింది అంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. దేవర మూవీ పైసా వసూల్ మూవీ అని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించే మూవీ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

స్టూడెంట్ నంబర్1 రిలీజైన 23 ఏళ్ల తర్వాత దేవర రిలీజ్ కాగా ఈరోజే సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడని కార్తికేయ పేర్కొన్నారు. తారక్ సక్సెస్, ఎదుగుదలను చూస్తూ తాను పెరిగానని కార్తికేయ వెల్లడించడం గమనార్హం. దేవర సక్సెస్ పెద్ద గిఫ్ట్ అని నాకు అస్సలు మాటలు రావడం లేదని కార్తికేయ పేర్కొన్నారు.

ఆల్ హెయిల్ ది టైగర్ అని చెబుతూ తారక్ తో దిగిన ఫోటోను కార్తికేయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేవర సినిమా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చిన నేపథ్యంలో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 180 కోట్ల రూపాయల టార్గెట్ ను దేవర మూవీ సులువుగానే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

విజయ్‌ – గౌతమ్‌ సినిమా.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus