బిగ్‌బాస్‌ సారీ చెప్పాలంటున్న ర్యాపర్‌… ఎందుకు?

బిగ్‌బాస్‌లో ఈ రోజు నవ్వులు పండుతాయని నిన్న అనుకున్నాం. ఏదో ఫన్నీ స్కిట్స్‌ చేయమని టాస్క్‌ ఇచ్చాడు కదా. హౌస్‌ మేట్స్‌ అదే పనిలో ఉంటారు. ఈ రోజు నవ్వుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రోమోలు చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు. ఓవైపు నియమాలు పాటించలేదని బిగ్‌బాస్‌ శిక్షలు వేస్తుంటే, ఇంకోవైపు నోయల్‌ బయటకు వెళ్లిపోతా అంటున్నాడు. ఏమైందో ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ‘బిగ్‌బాస్‌ వచ్చి నాకు సారీ చెప్పాలంతే…’ అంటూ పట్టుబట్టి మరీ కూర్చుకున్నాడు నోయల్‌.

బిగ్‌బాస్‌ నియమాలు పాటించనందుకు ఓ బోర్డు మీద ఏదో రాయమని బిగ్‌బాస్‌ చెప్పాడు. మోనాల్‌ అలా రాయడం ఉదయం ప్రోమోలో చూశాం. నోయల్‌ టర్న్‌ వచ్చేసరికి కోపం వచ్చేసింది. నాకు తెలిసి షోలో నోయల్‌కు కోపం రావడం ఇదే తొలిసారి. ‘ప్రకృతి ఎంత బాగుంటుందో… అంతే చెడ్డగా ఉంటుంది.. ప్రతి ఒక్కరూ అంతే’ అంటూ సుజాతకి వేదాంతం కూడా వల్లిస్తున్నాడు. ‘వాళ్లు కెలికారు.. బస్తీ మే సవాల్‌ మామ’ అంటూ నోయల్‌ లేచి వెళ్లబోయాడు.

అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, కుమార్‌ సాయి సీరియస్‌గా చూస్తున్నారు కూడా. అసలు ‘ఈ శనివారం వెళ్లిపోదామని నిర్ణయించుకున్నా. నాగార్జున సర్‌ వచ్చాక చెప్పేసి వెళ్లిపోతా’ అంటూ షాక్‌ ఇచ్చాడు నోయల్‌. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఈ రోజు తెలుస్తుంది.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus