పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్లు మారుతున్నాయి లేదంటే క్లారిటీ రావడం లేదంటూ ఎప్పుడో రెండు నెలల తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ నెలలోనే రావాల్సిన ఓ పాన్ ఇండియా సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సినిమా గురించి చెబుదాం అనేదే మా ప్రయత్నం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు హీరోగా తెరకెక్కిన ఓ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉందనే విషయం మీకు గుర్తుందా? ఆ సినిమానే ఇప్పుడు వాయిదా వేస్తున్నారట.
వరుణ్తేజ్ఉ ఈ మధ్య కాలంలో ఏదీ కలసి రావడం లేదు. వరుస సినిమాలు చేస్తున్నా ఆశించిన విజయం దక్కడం లేదు. ‘ఎఫ్ 2’ ఫ్రాంఛైజీ ‘ఎఫ్ 3’ విజయం సాధించినా… ఆయన కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు అంటున్నారు. ఇక ‘గాండీవధారి అర్జున’ అయితే దారుణ ఫలితాన్ని ఇచ్చింది. అయితే ఈ విషయాలేవీ పట్టించుకోకుండా వరుణ్ దగ్గరకు ఓ పాన్ ఇండియా సినిమా వచ్చింది.అదే ‘ఆపరేషన్ వాలెంటైన్’. బాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు పడుతోంది.
ఎప్పుడో పూర్తయిపోయిన ఈ సినిమా రిలీజ్ విషయంలో వరుస డింకీలు కొడుతోంద. డిసెంబరు 8నే సినిమాను రిలీజ్ చేస్తామని తొలుత చెప్పారు. అయితే ఏమైందో ఏమో సినిమాను రెడీ చేయలేక ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు. ఇప్పుడు చూస్తే మరో రెండు వారాల సమయమే ఉంది. ఇంతవరకు ప్రచార సెగ కనిపించడం లేదు. దీంతో ఈ సారి కూడా రాకపోవచ్చు అని అంటున్నారు. వేసవి రిలీజ్ గురించి ఆలోచిస్తున్నారట. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని రిపేర్లు అవసరమయని టీమ్ భావిస్తోందట.
అందుకే సినిమాను (Operation Valentine) ఆలస్యంగా రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు అనే మాటలూ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి పెద్దగా హైప్ లేదు. హీరో తప్ప ప్రధాన నటులు, నిర్మాత, దర్శకుడు బాలీవుడ్‌కి చెందిన వారు కావడమే ఆ హైప్ లేమికి కారణం.