Suresh Babu: అవన్నీ ఓటీటీకే ఇచ్చేశాం: సురేశ్‌బాబు

సురేశ్‌బాబు పక్కా బిజినెస్‌ మ్యాన్. ఏ సమయానికి ఎలా రియాక్ట్‌ అవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే సురేశ్‌ప్రొడక్షన్స్‌ని ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అవి కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఓటీటీల విషయంలో అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. సినిమా మొత్తం పూర్తయ్యాక, ఓటీటీలతో డీల్‌ మట్లాడుకోవడం, ముందే మాట్లాడుకొని సినిమాలు పూర్తి చేయడం లాంటి రెండు కాన్సెప్ట్‌లు ఇండస్ట్రీలో ఉన్నాయి. సురేశ్‌బాబు ఈ రెండు కాన్సెప్ట్‌లను చాలా చక్కగా వాడేస్తున్నారు.

వెంకటేశ్ ‘దృశ్యం 2’, ‘నారప్ప’సినిమాలు పూర్తయ్యాక ఓటీటీతో డీల్‌ మాట్లాడి రిలీజ్‌ చేసుకొని మంచి లాభం పొందారు. ఇప్పుడు మరికొన్ని సినిమాల విషయంలో ఇలాంటి డీల్‌ కుదుర్చుకునే పనిలో ఉన్నారు. ఇంకొన్ని సినిమాలకు డీల్‌ ఓకే చేసేశారు. ఇటీవల తమ ప్రొడక్షన్ హౌస్‌ సినిమాల గురించి చెబుతూ… ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఆ లెక్కన మూడు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోతున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకిని డాకిని’ని ఓటీటీలో విడుదల చేస్తారట.

ఇందులో రెజీనా కసాండ్ర, నివేదా థామస్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు శ్రీ సింహా – సతీష్‌ త్రిపుర కాంబోలో రూపొందుతున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ను కూడా ఓటీటీకి ఇచ్చేశారట. దీంతోపాటు కొరియన్‌ సినిమా ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’రీమేక్‌ను కూడా ఓటీటీ కోసమే సిద్ధం చేస్తున్నారట. అలా సురేశ్‌ ప్రొడక్షన్‌ కాస్త… సురేశ్‌ ‘ఓటీటీ’ ప్రొడక్షన్స్‌ అవుతోంది. అన్నట్లు ‘విరాటపర్వం’ గురించి అడిగితే… ఇంకా క్లారిటీ రాలేదు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus