Pawan Kalyan: ఓ సెట్‌ ఇన్ని రోజులు ఉండటం ఆశ్చర్యమే కానీ.. వేరే ఆప్షన్‌ లేదు!

పవన్‌ కల్యాణ్‌ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో లైవ్‌లో ఉన్నవి రెండు.. ఆ మాటకొస్తే ఒకటే అని చెప్పాలి. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘ఓజీ’ సినిమాలు పవన్‌ ఇప్పుడు చేయాలి. అయితే ఆర్డర్ అంతా మారిపోతోంది. ఆఖరిగా మొదలైన సినిమా 60 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మొదటి స్థానంలో ఉన్న సినిమాకు పవన్‌ ఈ మధ్య డేట్స్‌ ఇవ్వడం లేదు.

అయితే ప్రతి నెలా ‘ఇదిగో మొదలు, అదిగో మొదలు’ అని మాట అయితే ‘హరి హర వీరమల్లు’ గురించి వస్తోంది. తాజాగా మరోసారి అలాంటి వార్తలే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం టీమ్‌ భారీ సెట్స్‌ వేసింది. అందులో కొన్ని రోజులు షూటింగ్‌ అయ్యాక ఆగిపోయింది. కొత్త షెడ్యూల్ ఇదిగో అని అంటున్నారు కానీ అవ్వడం లేదు. అయితే తాజా పుకార్ల ప్రకారం అయితే… సెప్టెంబర్ రెండో వారం నుండి ఈ సినిమాకు పవన్‌ డేట్స్ ఇచ్చాడని చెబుతున్నారు.

పవన్ (Pawan Kalyan) డేట్స్ ఓకే అయితే… ఈ షెడ్యూల్‌లో పవన్‌పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారని భోగట్టా. నిజానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ఓ భారీ సెట్ వేశారు. అయితే పవన్‌ ఇతర సినిమాలను ముందుకు పెట్టడంతో ఆ సెట్స్‌ అలా ఉండిపోయాయి. అయితే ఇప్పుడు ఆ సెట్స్‌ను దృష్టిలో పెట్టుకునే డేట్స్ ఇస్తున్నారట. ఇంకొన్నాళ్లు సెట్స్‌ అలా ఉండటం అంటే కష్టం అనే అభిప్రాయం, చర్చ మొదలయ్యాయట.

అయితే మరి అనుకున్నట్లుగా పవన్‌ డేట్స్‌ ఇస్తాడా. ‘ఓజీ’, ‘ఉస్తాద్‌..’ ను కాదని ఈ సినిమా మొదలవుతుందా అనేది చూడాలి. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ‘హరి హర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుండగా… జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్‌ చేయనున్న ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus