Prabhas: రూట్ మార్చిన ప్రభాస్.. పారితోషికం విషయంలో నిర్ణయమిదే!

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మారుతి కెరీర్ ను ఈ సినిమా డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమా కోసం రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదని బోగట్టా. ఈ సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాపై ఒకింత అంచనాలు తక్కువగా ఉన్నాయి.

దర్శకుడు మారుతిపై ఒత్తిడి పడకుండా ఉండాలని ప్రభాస్ ఈ విధంగా చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మారుతి ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాలని అనుకుంటున్నారు. మారుతి మార్కెట్ ను మించి ఖర్చు చేయడానికి నిర్మాతలు ప్రాధాన్యతనిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పారితోషికం విషయంలో రూట్ మార్చడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీ అవుతున్నారు. ఈ ఏడాదే ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న ప్రభాస్ కెరీర్ ను కొత్తగా ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇకపై సినిమాలన్నీ వరుస సక్సెస్ లను సొంతం చేసుకునేలా కథల విషయంలో ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రభాస్ మార్కెట్ సైతం పెరుగుతోంది. ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus