Project K: ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా స్టిల్స్‌లా ఉన్నాయంటూ సోషల్‌ మీడియా ప్రచారం.. నిజమేనా?

ఒకప్పుడు ఇంటర్నెట్‌ను నమ్మొద్దు అనేవారు. ఎందుకంటే అందులో ఏది నిజం, ఏది నిజం కాదు అనేది చెప్పలేకపోయేవారు. అన్నీ నిజమే అనిపించేవి కానీ.. ఏవీ నిజం కావు అనిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.. జనాలు అన్నింటిని నమ్మడం లేదు. ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చాక పరిస్థితి ఇంకా మారిపోయింది. మళ్లీ తొలి రోజుల్లోని సమస్యే వస్తోంది. నిజమైనా ఫొటోనా, రియల్‌ వీడియో ఏనా అనే డౌట్స్‌ వస్తున్నాయి. అలా తాజాగా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అంతేకాదు ఆ ఫొటోల్లో ఉన్నట్లుగానే ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా ఉంటుంది అని కూడా అంటున్నారు. దేశంలో మోస్ట్ హైప్ ఉన్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి అని చెప్పొచ్చు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ లాంటి భారీ స్టార్‌ కాస్ట్‌ ఉంది. ఈ సినిమా కథేంటి, కాన్సెప్ట్‌ ఏంటి అనే వివరాలు ఇప్పటివరకు చెప్పకపోయినా.. మనషులకు, సూపర్‌ మనుషులకు మధ్య జరిగే కథ అని మాత్రం సమాచారం.

ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్‌ లుక్‌లు, కొన్ని ఆన్‌ సెట్‌ ఫొటోలు అదే విషయాన్ని చెబుతున్నాయి. దీంతో సినిమా మీద బజ్‌ మామూలుగా లేదు. అయితే ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మీద అవగాహన ఉన్న ఓ ఔత్సాహికుడు ఆ ఫొటోలను షేర్‌ చేశారు. వాటిని చూసిన నెటిజన్లు.. ఇవి ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలోని ఫొటోలు, స్టిల్స్‌ అంటూ వైరల్‌ చేసేస్తున్నారు. వీటి సంగతి తేలాలంటే జనవరి 12, 2024 రావాల్సిందే.

ఆ రోజే ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) లోకంలోని మనల్ని తీసుకెళ్లనున్నారు. అయితే ఈలోపు టీజర్‌, ట్రైలర్‌తో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నట్లు చెప్పలేదు కదా.. ఈ ఫొటోలు రిలీజ్‌ చేసింది ప్రముఖ గ్రాఫిక్, డిజిటల్, ఫ్యాంటసీ వరల్డ్ డిజైనర్ విలియం కాస్. అసాధారణమైన ఫాంటసీ లోకాన్ని ఊహించి ఏఐతో సృష్టించడం ఆయనకు అలవాటు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus