పుష్ప రాజ్ పొలిటికల్ సీన్స్.. సెటైర్ ప్లాన్ చేశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2)  విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేయడంతో సినిమాపై భారీ హైప్‌ను మరింత పెంచింది. ఈసారి అల్లు అర్జున్ పాత్రలో పుష్పరాజ్ మరింత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Pushpa 2

ఇటీవల లీక్ అయిన ఫోటోలో వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో ఉన్న పుష్పరాజ్ తాలూకు లుక్ వైరల్ అయ్యింది. ఈ ఫోటో చూసిన బన్నీ ఫ్యాన్స్ పుష్పరాజ్ ఇంటర్వెల్ అనంతరం రాజకీయ నాయకుడిగా ఒక.ఎపిసోడ్ లో హైలెట్ అవుతాడని టాక్ వస్తోంది. ఎంఎల్ఏ పుష్పరాజ్ అంటూ అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ సీన్ కేవలం కథనానికి ప్రాధాన్యాన్ని కల్పించడానికేనా, లేక మరేదైనా సెటైర్ ప్లాన్ చేశారా అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

ఈ రోజుల్లో పొలిటికల్ గా ఎలాంటి సినిమా వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై సెటైర్ వేశారు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అయితే సుకుమార్  (Sukumar)  అలా ఎప్పటికి చేయడు అనేది చాలామంది నమ్మకం. ఏదేమైనా ఈ లీక్ తో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పుష్పరాజ్ పాత్రలో పొలిటికల్ షేడ్స్ ఉంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అది ఖచ్చితంగా అదనపు ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది.

సాధారణంగా సినిమాల్లో విలన్లు రాజకీయ రంగంలోకి మారడం చూసాం, కానీ ఈ సారి స్మగ్లర్‌గా ఉన్న హీరోనే పొలిటీషియన్‌గా మారడమనేది ఓ కొత్త కోణం. మరి సుకుమార్ ఈ సినిమా కథలో రాజకీయ రంగాన్నీ ఎలా చూపిస్తారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. వచ్చే ఐటెం సాంగ్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నా హిట్‌ మా హిట్‌ అంటున్నారు… మీ ప్రేమకు థ్యాంక్యూ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus