Prabhas: ఫస్ట్‌ సింగిల్‌ టీజర్‌ పోస్టర్‌లో ఇది గమనించారా…!

పెద్ద సినిమాలు వరుస కట్టడంతో రాబోయే ఐదారు నెలలు సినిమాల పండగే అని ఈ మధ్యే అనుకున్నాం. అయితే దీనికి అందరూ పాటలతో ఆహ్వానం పలికారు కానీ ప్రభాస్‌ ఒక్కడే ఇంకా పాటల బోణీ కొట్టలేదు అని కూడా చెప్పుకున్నాం. ఏంటి సినిమా ప్రచారం డౌన్‌ అయ్యింది. రిలీజ్‌ డేట్‌ వాయిదానా అనే పుకార్లూ మొదలయ్యాయి. అయితే ‘రాధే శ్యామ్‌’ నుండి తొలి సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. దాంతో అభిమానుల్లో ఉన్న చిన్న డౌట్‌ క్లియర్‌ అయ్యింది కానీ… పెద్ద డౌట్‌ బయటికొచ్చింది.

15వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని చెబుతూనే ఇటీవల పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అందులో సినిమా పేరు కింద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాత్రమే ఉన్నాయి. ఆ పోస్టర్‌లో హిందీ కనిపించలేదు. దీంతో ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారా? లేదా అనే సందేహం కొందరిలో మొదలైంది. మొన్నీ మధ్య ‘పుష్ప’ విషయంలోనూ ఇలానే జరిగింది. అయితే అలాంటి డౌట్‌ వద్దని ఆ టీమ్‌ చెప్పింది.

ఇప్పుడు వస్తున్న పుకార్లు, అనుమానాల నివృత్తి చేయాల్సిన బాధ్యత ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ మీద ఉంది. సినిమా హిందీ వెర్షన్‌ ఫస్ట్‌ సింగిల్‌ను ఎందుకు రిలీజ్‌ చేయడం లేదు అనేది చెప్పాల్సి ఉంది. ఒకవేళ తర్వాత రిలీజ్‌ చేస్తాం అని అంటే… ఆ విషయమైనా చెప్పాలి. నిజానికి సౌత్‌, నార్త్‌ కోసం వేర్వేరు సంగీత దర్శకుల్ని ఎంచుకున్నారు. దక్షిణాది కోసం జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందించగా, హిందీలో మిథూన్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతమందించారు.

ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ లిరిక్‌ను తెలుపుతూ తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ పోస్టర్లు రిలీజ్‌ చేశారు. కానీ హిందీ కోసం పోస్టర్‌ కానీ, లిరిక్‌ పేరు గానీ ఎక్కడా చెప్పలేదు. దీంతో హిందీ పాట మాత్రమే రాదా, లేక హిందీ వెర్షన్‌ కూడా ఇప్పుడు రాదా అనే ప్రశ్న మొదలైంది. బాలీవుడ్‌ పెద్ద కార్యక్రమం లాంటిది పెట్టి పాటలు విడుదల చేద్దాం అనుకుంటున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus