హెడ్డింగ్ చూసి… రాజమౌళి సేఫ్ గేమ్ ఆడటమా నెవ్వర్ అని అంటారా. అయితే ఆగండి… కాసేపు ఆ పదం పక్కనపెట్టి రాజమౌళి ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం. సినిమా కథలో ఫ్లాష్‌బ్యాక్, ప్రజెంట్ అనేవి సహజంగా ఉంటాయి. కొంతమంది ఫ్లాష్‌బ్యాక్ కోసం సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తే, ఇంకొందరు జన్మల వెనక్కి వెళ్లిపోతుంటారు. అలా రాజమౌళి గతంలో ఒకసారి వెళ్లారు. అదేనండీ ‘మగధీర’తో. ‘మగధీర’లో రాజమౌళి చూపించిన కథ, కథనం, బ్యాక్‌డ్రాప్, ఫ్లాష్‌బ్యాక్ ఎంత కిక్ ఇచ్చాయో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలోనూ రాజమౌళి అదే పని చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు ఓ సందర్భంలో ఎదురుపడతారు. కలసి ఓ వ్యవస్థ లాంటి వ్యక్తి మీద పోరాడతారు. అప్పుడు ప్యారలల్‌గా కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు ఎంటర్ అయ్యి… స్వాతంత్ర్య ఉద్యమ నాటి రోజులకు తీసుకెళ్తారట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ. ఇదే జరిగితే ఒక విధంగా రాజమౌళి సేఫ్ గేమ్ ఆడినట్లే.
ఎప్పటికప్పుడు కొత్త ఆలోచన చేసే రాజమౌళి అండ్ కో ‘మగధీర’ కాన్సెప్ట్‌ను మళ్లీ తీసుకురావడం అంటే ముందు హిట్ అయిన ఫార్ములాను వాడటమే కదా. అందుకే సేఫ్ గేమ్ అని అన్నాం. అయితే ఎలాంటి ఫార్ములా అయినా జక్కన్న తనదైన శైలిలో అద్భుతంగా మార్చేస్తారు. ఇప్పుడు అదే చేస్తారనుకోండి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!